కోర్ హీట్ వేవ్ జోన్‌లో తెలంగాణకు కాస్త ఉపశమనం దొరకనుంది.  రానున్న 24 గంటల్లో  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలుల వీచే అవకాశముందని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.


రాష్ట్రవ్యాప్తంగా గురువారం భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఫలితంగా తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పాటు రాజస్థాన్ వైపు నుంచి వడగాలులు వీస్తున్నాయి.ఎండ తీవ్రతకు వడగాలులు తోడవడంతో ఎండలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న వేళ  వర్షం పడితే కాస్త ఉపశమనం దొరికినట్లవుతుంది.