బెంగళూరు వేదికగా జేడీయూ నేతలు దేవేగౌడ, కుమారస్వామితో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ భేటీలో బీజేపీని ఓడిచేందుకు సమిష్ఠిగా పనిచేయాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తో కలిసి నడవాలని సంకల్పించాయి. భేటీ అనంరతం దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ దేశంలో సెక్యూలర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా అన్ని సెక్యులర్  పార్టీలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం ఏకమౌతామని పేర్కొన్నారు. మోడీ సర్కార్ ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు కదులుతామన్నారు. ఎన్డీయే కూటమి, బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా దేవేగౌడ అభిందనలు తెలిపారు.