అమరావతి: తెలంగాణలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించేందుకు సిధ్ధమౌతున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన తెలంగాణలోనూ పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబుతో టి.టీడీపీ అధ్యక్షుడు భేటీ
సోమవారం ఈ ఉదయం చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తమ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  తెలంగాణలో పర్యటించాల్సిందిగా ప్రతిపాదించారు. ఎల్ రమణ చేసిన ప్రతిపాదనను చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.  తెలంగాణకు కొంత సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆపై ఎన్టీఆర్ వర్థంతికి ఏర్పాట్లు.. రక్తదాన శిబిరాల నిర్వహణపైనా ఎల్ రమణ చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి. 


బాబు పర్యటనతో టీడీపీ పుంజుకునేనా ?
రాష్ట్రవిభజనతో తెలంగాణలో టీడీపీ నామ రూపాల్లేకుండా పోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటనతో ఏ మేరకు పుంజుకుంటుందనే అంశంపై  రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో తన ప్రాబల్యం పెంచుకనేందుకు చంద్రబాబు కసరత్తు చేయడం..దీనికి సంబంధించిన వ్యూహరచన చేయడం వంటి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.