Chandrayangutta Police Arrested Fake Baba: మీ కష్టాలు తీరుస్తామని అమాయక ముస్లిం మహిళలను మాయమాటలతో నమ్మించి న్యూడ్​ ఫొటోలు, వీడియోలు తీస్తు బ్లాక్​ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ నకిలీ బాబాను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా కర్ణాటకలోని బసవకళ్యాణ్‌కు  చెందిన మరో బాబాకు ఈ మహిళల నగ్న చిత్రాలు పంపుతున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ముంబైలోని వ్యభిచార ముఠాలకు మహిళ ఫొటోలు చేరుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ బాబా ఫోన్​లో 500 వరకు మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు సమచారం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాలలోకి వెళితే .. బీదర్​ బసవకళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్​ హుస్సేన్​ (35) కొంత కాలం క్రితం పాత బస్తీలోని బార్కాస్​ సలాలా ప్రాంతానికి  వలస వచ్చాడు. ఇక్కడ నకిలీ భూత వైద్యుని అవతారం ఎత్తాడు. నిరుపేద ముస్లిం మహిళలనే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. మీ కష్టాలు తీరుస్తానని వారిని నమ్మించేవాడు. తాను చెప్పింది వింటే.. మీ కష్టాలు  తొలగిపోవడమే గాక డబ్బుల వర్షం కురిపిస్తానని మాయ మాటలతో గదిలోకి తీసుకువెళ్లేవాడు. అక్కడ మహిళల న్యూడ్​ ఫోటోలు, వీడియోలు  తీసుకునేవాడు. వారి నగ్న చిత్రాలను గుల్బర్గాకు చెందిన మంత్రగాడు గులామ్‌కు పంపుతున్నట్లు తెలిసింది. అతని సూచనలు, సలహాల మేరకు మహిళల నగ్న చిత్రాలను అడ్డం పెట్టుకుని బ్లాక్​ మెయిల్‌కు దిగుతున్నాడు. సయ్యద్​ హుస్సేన్‌ను​ చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ బాబా కేసును వ్యభిచార కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


శరీర ఆకారాన్ని బట్టి.. న్యూడ్ ఫొటోస్ చూసి రేట్ ఫిక్స్ చేస్తున్న వ్యభిచార ముఠా సభ్యులు రేటు ఫిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. లావుగా ఉంటే రిజెక్ట్ చేశారు. కాళ్లు, మొహం తీయకుండా ఇతర శరీర భాగాలు ఫొటోలు, వీడియోస్ తీసి పంపుతున్నట్లు సమాచారం. సయ్యద్ హుస్సేన్‌పై 417, 354, 420 కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


ఫలక్ నామ ఏసీపీ జహింగీర్ మాట్లాడుతూ.. నకిలీ బాబా పేరుతో మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. ఓ మహిళ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని.. డెకాయ్ ఆపరేషన్ చేసి గుట్టురట్టు చేశామని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో కొన్ని ఆధారాలు సేకరించామమని.. నిందితుడు వద్ద మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్‌గానూ పని చేస్తున్నాడని... గుల్బర్గాలో ఉన్న గులామ్ అనే వ్యక్తి తనను ఇక్కడికి పంపించినట్లు చెబుతున్నాడని అన్నారు. 


'స్వాధీనం చేసుకున్న  మొబైల్‌లో మహిళలకు సంబంధించిన నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. గులామ్‌తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించాం. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తామని మాయమాటలు చెప్పి ఫోటోలను తీస్తున్నాడు. ఆ ఫోటోలను ఎక్కడకి పంపిస్తున్నాడనే దానిపై విచారణ చేస్తున్నాం. గుల్బర్గాలో ఉన్న గులాం అనే వ్యక్తి కోసం టీమ్స్‌ను పంపించాం. బాధిత మహిళలు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..' అని ఏసీపీ తెలిపారు.


Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డి పవర్‌పుల్ స్పీచ్.. మధ్యలో అస్వస్థత.. కార్యకర్తల్లో ఆందోళన  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరిలోనే వరుసగా శుభవార్తలు..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి