Cheetah Spotted at shamshabad Airport: రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. గత వారం రోజులుగా చిరుత సంచారంతో హైదరాబాద్ వాసులు కూడా బెంబేలెత్తి పోయారు. అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఎయిర్‌ పోర్ట్‌ పరిసరా ప్రాంతంలో చిరుత సంచారం తెలియగానే వారు అక్కడ 5 బోన్లు, దాదాపు 20 కెమెరాల వరకు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో బోను చుట్టు చిరుత తిరిగిన ఫోటోలు కెమెరాలో చిక్కాయి ప్రస్తుతం ఆ బోనులోనే చిరుత చిక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో చిక్కిన చిరుత షాద్‌ నగర్ ప్రాంతం నుంచి తప్పించుకుని వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ చిరుతను నెహ్రూ జూ పార్క్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌కు పంపించే పనుల్లో ఉన్నారు. 


ఇదీ చదవండి:ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..


నాలుగు ఐదు రోజుల కింద నుంచి ఓ చిరుత రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ పరిసరా ప్రాంతాల్లో సంచరిస్తోందని 7 అడుగుల ఎత్తైన ఎయిర్‌ పోర్టు గోడను దూకి లోపలికి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో అలారం మోగడంతో ఎయిర్‌ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే చిరుత కోసం బోను, కెమెరాలను అమర్చారు. ఇక రంగారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్లకు చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో పరిశీలించారు. 5 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పచ్చని ఎయిర్‌ పోర్ట్‌ పొదల్లో చిరుత తిరిగిన ఆనవాళ్లు, చిత్రాలు సీసీ కెమెరా ఫూటేజీల్లో నమోదయ్యాయి. దాని కదలికలు ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వే పై కూడా కనిపించాయి. దీంతో చిరుతకు ఎరగా బోనులో మేకలను కూడా పెట్టారు. 


ఇదీ చదవండి:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..


దీంతో మరింత అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్థులకు కూడా హెచ్చరికలు చేశారు. ఒంటరిగా ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకూడదని గ్రామస్థులను హెచ్చరించారు. నీటి కోసం సంచరిస్తూ చిరుత ఎయిర్‌ పోర్ట్‌ పరిసరా ప్రాంతాలకు వచ్చి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, ఎట్టకేలకు చిరుత కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన బోనులోనే చిరుత చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత సక్సెస్‌ అయింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter