KTR Harish Rao Clashes: అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీలో ముసలం కొనసాగుతోందని తెలుస్తోంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరినట్లు చర్చ జరుగుతోంది. పార్టీకి రెండు కళ్లుగా ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నాయకుడు హరీశ్ రావు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వార్తలకు తాజా పరిణామం ఆజ్యం పోసింది. ఒకే కార్యక్రమానికి ఇద్దరూ వేర్వేరుగా హాజరవడం కావడం చూస్తుంటే వారి మధ్య విభేధాలు నెలకొన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. కొన్ని నెలలుగా లోలోపల వారి మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bandi Sanjay: మోదీ బర్త్ డే ‘తోఫా’.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బండి సంజయ్‌


ఏం జరిగింది?
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. తాజాగా ఆమె దశ దినకర్మ గురువారం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. అయితే ఆయన హాజరై వెళ్లిన కొద్దిసేపటికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు వచ్చారు. వీరిద్దరూ వేర్వేరుగా వచ్చి లక్ష్మారెడ్డి సతీమణికి నివాళులర్పించారు.

Also Read: Harish Rao: తాను తవ్వుకున్న గుంతలోనే రేవంత్‌ పడుతున్నాడు: హరీశ్‌ రావు స్ట్రాంగ్ కౌంటర్


 


దూరం దూరం
ఒకే కార్యక్రమానికి కేటీఆర్‌, హరీశ్‌ రావు వేర్వేరుగా రావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆవంచ గ్రామానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌, హరీశ్‌ రావు వేర్వేరుగా చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పాడి కౌశిక్‌ రెడ్డి వ్యవహారంలో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు అరెస్టయి అర్ధరాత్రి దాకా తిప్పినప్పుడు కేటీఆర్‌ రంగంలోకి దిగలేదు. కేవలం ట్విటర్‌లోనే స్పందించారు. అంతకుముందు రుణమాఫీ విషయంలో రేవంత్‌ ఒట్లతో మోసం చేయడంతో దానికి నిరసనగా హరీశ్ రావు యాదాద్రిని సందర్శించారు. యాదాద్రిలో పాప పరిహారం పూజ చేశారు. అయితే దీనికి కేటీఆర్‌ మద్దతుగా నిలవలేదని సమాచారం. హరీశ్ రావు పార్టీ అనుమతి లేకుండా సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే భావనలో కేటీఆర్‌ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత అజెండాతో హరీశ్ రావు దూకుడుగా వెళ్తుండడంతో దానికి కేటీఆర్‌ మద్దతుగా నిలవడం లేదని సమాచారం. ఇదే విషయమై వారి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయని తెలుస్తోంది.


వేదిక పంచుకోని బావ బామ్మర్దులు
కవిత బెయిల్‌ అంశంలో ఢిల్లీలో వీరిద్దరూ కలిసి పని చేశారు. హైదరాబాద్‌కు తిరిగిచ్చాక హరీశ్‌ రావు మళ్లీ కనిపించలేదు. కవిత నివాసంలో.. కేసీఆర్‌ నివాసంలో హరీశ్ రావు కనిపించలేదు. కొన్ని రోజులు కేసీఆర్‌కు కూడా హరీశ్ రావు దూరంగా ఉన్నారు. కేటీఆర్‌తో కలిసి హరీశ్ రావు వేదికలు పంచుకోవడం లేదు. కొన్ని సమావేశాలు.. కార్యక్రమాలలో కేటీఆర్‌, హరీశ్ రావు దూరం దూరంగా ఉంటున్నారు. బావ బావమ్మర్దుల మధ్య ఈ విభేదాలు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే విభేదాలు అనేవి ఉత్తి పుకార్లేనని గులాబీ పార్టీ కొట్టిపారేస్తోంది. ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళం అని చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter