Bhatti Vikramarka: ఖైరతాబాద్-రాజ్‌భవన్‌ రోడ్డులో యుద్ధ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డీసీపీ జోయల్ డెవిస్‌ ముందుకు తీయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో భట్టి విక్రమార్క, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను తోసేస్తావా అంటూ డీసీపీ జోయల్‌పై ఆయన మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బైక్‌లను తగలబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.


రాజ్‌భవన్‌ వైపు వెళ్లకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని దాటుకుని రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు ఇతర నేతలు రాజ్‌భవన్‌ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాజ్‌భవన్‌ వైపు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు.


Also read: Minister KTR Tweet: ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ మధ్య ఏముంది..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!


Also read:Renuka Chowdhury: పోలీసులపై రేణుకా చౌదరి చిందులు..ఎస్సై చొక్కా పట్టుకున్న నేత..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook