వెయ్యి కోట్లతో పాతబస్తీ ముస్తాబు: కేసీఆర్
సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మైనార్టీల సమస్యలు, పాతబస్తీ సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మైనార్టీల సమస్యలు, పాతబస్తీ సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎస్ ఎస్.కె.జోషి, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పాతబస్తీలో రూ.వెయ్యికోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే తానే స్వయంగా పాతబస్తీలో పర్యటించి శంకుస్థాపన చేసి యుద్ద ప్రాతిపదికన పనులు జరిపిస్తామన్నారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి అభివృద్ది పనుల ప్రకటన చేస్తామన్నారు. వరదలకు ఆస్కారం లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. మూసీ ప్రక్షాళన, నవీకరణకు 1600కోట్లు ఖర్చు చేస్తామని, రూ.1200 కోట్ల మెట్రో రైలు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా కేసీఆర్ తెలిపారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాతబస్తీ పనులపై సీఎస్ వారం రోజులకోసారి సమీక్ష నిర్వహించాలన్నారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పాస్‌పుస్తకాల ముద్రణ, ఇతర అంశాల గురించి మాట్లాడి, పాస్ పుస్తకాల పంపిణీ కార్యాచరణపై చర్చించారు. పాస్‌పుస్తకాల పంపిణీ ఎప్పటినుంచి చేయాలనే అంశంపై ఒఅక్తి రెండు రోజుల్లో ఫైనల్ కానుంది.