CM KCR on Kashmir Files: ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ ఫైర్ అయ్యారు. ప్రగతిశీల ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎనకమిక్ ఫైల్స్, ఇరిగేషన్ ఫైల్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయని.. అంతేకానీ ఇలా కశ్మీర్ ఫైల్స్‌ను తెర పైకి తీసుకురావడమేంటని ప్రశ్నించారు. కశ్మీర్ ఫైల్స్ ఎవరికి కావాలి.. దానితోని వచ్చేదేంటని మండిపడ్డారు. ఇది కేవలం ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే వ్యవహారమని కశ్మీరీ పండిట్లే ఢిల్లీలో చెప్పారని అన్నారు. దేశాన్ని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్‌లో ఎలాగైతే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో.. తెలంగాణలో పండించే యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. దీనిపై రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదని.. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సమ్మతించని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం ఉంటుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా కూడా తీర్మాన్లు పంపిస్తామన్నారు. కేంద్రం నుంచి వంద శాతం ధాన్యం కొనుగోలుకు హామీ లభించేంతవరకూ టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందన్నారు.


ఎనిమిదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క కొత్త ప్రాజెక్టును చేపట్టకపోగా.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. దేశం అభివృద్ది పథంలో నడవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండొద్దనే నిర్ణయానికి దేశం వచ్చిందని.. ఇటీవలి యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం దీనికి సంకేతమని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. బీజేపీ పాలన.. అయితే డీమానిటైజేషన్ లేదా మానిటైజేషన్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.



Also Read: Complaint for Mutton Curry: మటన్ కర్రీ వండలేదని భార్యపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టు!


Also Read: Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook