CM KCR focusing on Vemulawada: తెలంగాణ నేల మొదటి నుంచి శైవత్వానికి ఆలవాలంగా ఉందని చరిత్ర చెబుతోంది. తెలంగాణను పాలించిన కాకతీయులు సైతం శైవత్వాన్నే ఆరాధించినట్లు చరిత్రలో ఉంది. ఇక్కడి మెజారిటీ ప్రజలు శైవ ఆరాధకులనే వాదన కూడా ఉన్నది. అందుకే ఇక్కడ వేములవాడ పుణ్యక్షేత్రం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వైష్ణవానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన సీఎం కేసీఆర్... ఇప్పుడు శైవత్వానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కేసీఆర్.. ఇక నుంచి వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సొంత మీడియాలోనే దీనికి సంబంధించిన వరుస కథనాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రి పునర్నిర్మాణం తరహాలోనే వేములవాడ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. 37 ఎకరాల్లో ఆలయ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాజన్న ఆలయం 16 గుంటల్లో విస్తరించి ఉండగా... దాన్ని 40 గుంటలకు విస్తరించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండో ప్రాకారం నిర్మాణం, గుడి చెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించడం, శివ కల్యాణాన్ని వేలాది మంది వీక్షించేలా వేదికల నిర్మాణం, బ్రహ్మ పుష్కరిణిని ఆధునీకరించడం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ వంటివి చేపట్టనున్నారు. యాదాద్రి తరహాలోనే భారీ నిధులు వెచ్చించి ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


త్వరలో శృంగేరి పీఠాధిపతి వద్దకు కేసీఆర్..


సీఎం కేసీఆర్ త్వరలోనే శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ జగద్గురు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులు తీసుకుని వేములవాడ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి భారతీ తీర్థ స్వామికే ఆగమశాస్త్ర సలహాదారు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 


భారతీ తీర్థ స్వామి ఆగమ నిర్దేశం మేరకే వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరగనున్నట్లు కేసీఆర్ సొంత మీడియాలో కథనాలు వస్తున్నాయి. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి చిన జీయర్ స్వామికి ఆగమశాస్త్ర బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.. ఇప్పుడు బారతీ తీర్థ స్వామి వద్దకు వెళ్లబోతుండటం చర్చనీయాంశంగా మారింది. చిన జీయర్‌తో చెడినందు వల్లే కేసీఆర్ భారతీ తీర్థ స్వామి వద్దకు అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. 


Also Read: DA Hike: ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- మరో 3 శాతం పెరిగిన డీఏ!


RRR Latest Updates: 'ఆర్ఆర్ఆర్‌'కు అక్కడ ప్రేక్షకులు కరువు..! ఏకంగా షో క్యాన్సిల్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook