CM KCR Approved Dalit Bandhu Second Phase Funds: దళిత బంధు పథకం రెండో విడత అమలుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ నియోజకవర్గంలో 1115 మందికి దళిత బంధు పథకం అమలు చేయనున్నారు. 118 నియోజకవర్గాలలో మొత్తం 1,29,800 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలో 14,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10 లక్షలు జమ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.500 కోట్లను ఖర్చు చేసింది. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లను ఈ పథకం కోసం కేటాయించింది.


Also Read: Aadhaar Card Photo Change: 8 ఏళ్ల బాలుడి ఆధార్‌ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో


దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తూ.. వారు స్వావలంబనతో జీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పథకం నుంచి లబ్ధిపొందిన వారు ఆ డబ్బుతో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ పథకం కింద మొదటి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 గ్రామాల్లో కొంత మందిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున రూ.20.06 కోట్లను ప్రభుత్వం అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద లబ్ధిపొందిన వారు వివిధ వ్యాపారాలు ప్రారంభించారు.


దళిత బంధు రెండో విడుత అమలుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలపడంతో రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దళితుల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యమని.. ఇప్పటికే మొదటి విడతలో ఈ పథకం ద్వారా లబ్దిపొందిన వారు ఉన్నతమైన జీవనం సాగిస్తున్నారని చెప్పారు. మరో 8 ఏళ్లలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం కింద లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం కేసీఆర్‌పై విపక్షాలు బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిక్షాలు ఎన్ని చేసినా.. ప్రజలు తిప్పి కొడుతున్నారని అన్నారు. 


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి