CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే విపక్షాలు దూకుడు పెంచాయి. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు. ధమ్ముండే ఎన్నికలకు తేది ఖరారు చేయాలని అన్నారు. డేట్ చెప్పండి.. నేను అసెంబ్లీ రద్దు చేస్తా అంటూ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో తేల్చుకుందాం దమ్ముంటే రావాలని విపక్షాలకు సవాల్ చేశారు సీఎం కేసీఆర్. ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. తమను ఎవరూ ఓడించలేరన్నారు కేసీఆర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారసత్వ రాజకీయాలపైనా ఆయన సంచలన కామెంట్లు చేశారు. జర్నలిస్ట్ కొడుకు జర్నలిస్ట్ అయితే వారసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. ఒక్కసారి మాత్రమే కుటుంబ పరపతి కలిసివస్తుందని.. సరిగా పనిచేయకపోతే తర్వాత ఎన్నికల్లో ప్రజలే దూరం కొడతారని కేసీఆర్ అన్నారు. కుటుంబ పాలన అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు కేసీఆర్. మోడీకి దమ్ము ఉంటే తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో ఏనాథ్ షిండే ను తీసుకురావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి పై తనకు తృప్తి ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని టాప్ స్థాయిలో ఉంచిన తాను ఎవరికి బయపడబోనని చెప్పారు. తనకు మనీ లేదు, లాండరింగ్ లేదన్న కేసీఆర్.. తమతో తో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్లే జాగ్రత్త అంటూ హెచ్చరించారు.


బీజేపీ పాలనలో దేశంలో  డేంజర్ పరిస్థితిలో ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ అన్నారు. దొంగ ఫోటోలు చూపించి మోడీ దేశానికి ప్రధాని అయ్యారని విమర్శించారు. నరేంద్రమోదీ మోడీ ప్రభుత్వాన్ని మారిస్తామని,  LIC ని అమ్మనివ్వమని చెప్పారు.  త్వరలోనే తమ  ఎజెండా ఏంటో చెబుతామన్నారు గులాబీ బాస్. 75 ఏళ్ల ఇండియా రాజకీయంలో బ్లేమ్ గేమ్ నడుస్తోందని అన్నారు. అవసరం అయిన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి ఉందన్నారు. సింగపూర్, చైనా రాజనీతి ఇండియాలో వచ్చినప్పుడే  అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అవసరం అయితే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందన్నారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే తప్పేంటి.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశం కాంగ్రెస్, బీజేపీ సొత్తా? దేశాన్ని త్తకు పట్టుకున్నారా?  అంటూ నిలదీశారు.కేసీఆర్ కేసులకు బయపడే వ్యక్తి కాదన్నారు. ఒకటో రెండో కేసులు పెడతారు.. కోర్టులు ఉన్నాయి కొట్లాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. 


Also read:Maharashtra: శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు..ఉద్దవ్ ఠాక్రేకు ఊరటనేనా..?


Also read:EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..త్వరలో ఒకేసారి పెన్షన్ జమ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook