CM KCR Inaugurates Brahmin Sadan: ప్రతి నెలా వేదపండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ భృతి పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్‌పల్లిలో 9 ఎకరాల్లో  నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. దీనిని రూ. 12 కోట్లతో నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఈ బ్రాహ్మణ సదనం వేదికగా నిలవనుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ కు ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని.. ఆ నిధులతో పరిషత్ అనేక సంక్షేమ  కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. 


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,645 ఆలయాలు ఉన్నాయని.. వీటికి ధూపదీప నైవేద్యం పథకం కింద ఇకపై ప్రతి నెలా రూ. 10 వేల రూపాయలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇంతకముందు రూ. 6 వేలు ఇచ్చేవారు. కొత్తగా మరో 2,796 ఆలయాలకు ఈ స్కీమ్ ను విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకపై వార్షిక గ్రాంట్‌గా అందజేయనున్నారు. అంతేకాకుండా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తామన్నారు. మెదక్‌ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. నిన్న చందానగర్‌ వేంకటేశ్వర దేవాలయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని సీఎం కేసీఆర్‌ కలిశారు. వీరిద్దరూ గంట సేపు ముచ్చటించారు. 


Also Read: 9 Years Of PM Modi: ప్రధాని 9 ఏళ్ల పాలనపై బండి సంజయ్ ఏం చేశారో చూడండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook