హైదరాబాద్: రాజ్‌భవన్ లో గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఓటాన్ బడ్జెట్, కేబినెట్ విస్తరణ అనే రెండు అంశాపై చర్చించినట్లు తెలిసింది. తొలుత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ బడ్జెట్ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్..దీనిపై గవర్నర్ నరిసింహన్ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కేబినెట్ కూర్పు, విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేబినెట్ జాబితాను  గవర్నర్ ముందు  ఉంచినట్లు సమాచారం. అభ్యర్ధి సామర్ధ్యం, సామాజికవర్గం, మహిళలకు ప్రాధాన్యత..తదితర అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విస్తరణ ముహుర్తం ఫిక్స్...


ఈ భేటీలో కేబినెట్ విస్తరణకు ముహుర్తం కూడా ఖరారైనట్లు తెలిసింది. ఈ నెల 19న ఉదయ 11:30కి మంత్రివర్గ విస్తరణకు ముహుర్త ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాటు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి


లేటైనప్పటికీ లెటెస్ట్ కేబినెట్  !


తెలంగాణ సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టినప్పటికీ 2 నెలల గడిచినప్పటకీ డిప్యూటీ సీఎం మహామూద్ అలీ మినహా సీఎం కేసీఆర్.. మంత్రి వర్గవిస్తరణ చేపట్టలేదు. అదేమంటే పంచాయితీ  పోరుతో కేబినెట్ బెర్తులను  ముడిపెట్టారు. ఇప్పుడు ఈ పోరు ఎలాగో ముగిసింది.ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తులు ఖరారు చేయాల్సి వచ్చింది. 


ఎవరికి ఛాన్స్ దక్కేను ?
కేసీఆర్ చెప్పినట్లుగా పంచాయితీ పోరులో అధిక స్థానాలను కట్టబెట్టిన వారికి ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. వీటితో పాటు అభ్యర్ధి సామర్ధ్యం, పార్టీకి విధేయత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేబినెట్ బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రూపొందించిన కేబినెట్ జాబితను గవర్నర్ నరసింహన్ ముందు ఉంచి వాటిపై చర్చించినట్లు సమాచారం.