CM KCR Speech Highlights: ఎన్నికలంటే సీటీలు, డోళ్లు, డప్పులు, లొల్లి లొకాండం, అబద్ధాలు, అభాండాలు, ఇష్టమొచ్చిన ఆరోపణలు, తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను గోల్ మాల్ తిప్పేటటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణగణాలను చూస్తూనే.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూడాలని కోరారు. అభ్యర్థి ఎన్నిక తర్వాత ఆ అభ్యర్థి ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రభుత్వం మంచిదైతే వచ్చే ఐదేండ్లు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం బాగాలేకుంటే వచ్చే ఐదేండ్లు ఆగమాగం అయిపోతదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాలకుర్తి, హలియా, ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ స్పీచ్ హైలెట్స్..


==> ప్రలోభాలకు గురై ఓట్లను వేయొద్దు. మీరు వేసే ఓటు మీ తలరాతను మారుస్తుంది.
==> ప్రజలు ఆలోచించి, నిజానిజాలు గమనించి ఎప్పుడైతే ఓట్లేస్తరో అప్పుడే ప్రజలు గెలుస్తరు. ప్రజలు గెలిసేదే నిజమైన ప్రజాస్వామ్యం.
==> బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజలను కాపాడటం కోసం.
==> యాభై ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది?.. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందని చూడాలి.
==> తెలంగాణ వచ్చినప్పుడు పాలకుర్తి ఎట్లా ఉండె.. ఇవ్వాల జరిగిన మంచి అభివృద్ధిని చూడండి.
==> బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు పాలకుర్తి నుంచి వేలాది మంది బతుకపోయిండ్రు.  
==> రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమాను ఇస్తోంది.
==> కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అంటుండు.
==> బీఆర్ఎస్ రూ.16 వేలు అవుతుంది. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమైతుంది.
==> కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమో రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటుండు.
==> పీసీసీ అధ్యక్షుడే 3 గంటల కరెంటు చాలని బల్ల గుద్ది చెబుతున్నడు.
==> కేసీఆర్‌కు ఏం తెల్వది.. 10 హెచ్‌పీ మోటాట్‌ను రైతులు పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతది.. మూడు గంటలు చాలు అంటుండు. 
==> రైతుల దగ్గర 10 హెచ్‌పీ మోటార్ ఉంటదా..? రైతులకు ఉండేదే 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు. మరి 10 హెచ్‌పీ మోటార్లు ఎవరు కొనియ్యాలె..? 
==> రాష్ట్రంలో చట్టబద్ధంగా 30 లక్షల మోటార్లు ఉంటే.. అదనంగా మరో రెండు మూడు లక్షల మోటార్లు ఉంటయ్. వీటన్నింటికీ 10 హెచ్‌పీ మోటార్లు కొనాలంటే ఎవరు కొనాలె..? రేవంత్ మీ తాత కొనిస్తాడా..?
==> ఎన్నికలప్పుడు తీయ్యగా పుల్లగా మాట్లాడి ఆరు సందమామలు తెస్తం.. ఏడు సూర్యులను తెస్తమంటరు. ఎన్నికలొచ్చినప్పుడే కాంగ్రెస్ లాంటోళ్లు ఎవరన్నా వచ్చి చెబితే గోల్ మాల్ కావొద్దు. 
==> కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పరిపాలించింది. 10 సార్లకు పైగా ప్రజలు ఛాన్సిచ్చిండ్రు.
==> కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహూల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులే స్వయంగా చెబుతున్నరు.
==> ధరణి లేకముందు ప్రభుత్వంలో ఏ చిన్న పని కావాలన్నా.. పహాణీ, నకల్ తెమ్మని.. ఈ కాగితం లేదు.. ఆ కాగితం లేదని.. ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాయడం.. మల్లయ్య భూమి పుల్లయ్యకు రాయడం.. జుట్లు జుట్లు ముడేయడం.. ఇలాంటి అనేక పంచాయతీ పెట్టడం చేసేవారు.
==> రైతుల భూములకు ఆనాడు వీఆర్వో, గిర్దావర్, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్.. అనేక మంది భర్తలుండేటోళ్లు. భూములపై వాళ్లదే పెత్తనమంతా. 
==> ఇవ్వాల ధరణి వచ్చాక.. ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ప్రభుత్వం రైతులకు, ప్రజలకు అప్పగించింది.
==>  రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు పైసలన్నీ రైతులందరికీ ధరణి ద్వారానే వస్తున్నయ్.
==> మరి ధరణి’ని తీసేస్తే రైతులకు డబ్బులు ఎలా వస్తయ్?
==> నా ప్రాణం అడ్డం పెట్టి నేను తెలంగాణ తెచ్చిన కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దని చెబుతున్నా. ఈ హక్కులు సామాన్యంగా రావు.  
==> యాభై ఏండ్లపాటు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా మీ పెత్తనం మీకు ఇయ్యలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.
==> రైతులు బాగుపడాలని మన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బీఆర్ఎస్‌నే గెలిపించాలని మిమ్మల్ని కోరుతావున్నాను. జై తెలంగాణ!.." అని కేసీఆర్ ప్రసంగం ముగించారు. \


Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?


Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి