హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని తేలిందని అన్నారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, రిపోర్టు చేయాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వమే చికిత్సతో పాటు అన్ని ఖర్చులు భరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారని, అందులో 11 వేల మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి 5274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయని, 63000 మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని ఆదివారం  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రకటించారని, తెలంగాణాలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకూ జనతా కర్ఫ్యూ ఉంటుందని, సిసిఎంబిలో ల్యాబ్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరానని అయితే వాలారు దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల మేరకు కార్యకలాపాలు నిర్వహించాలని వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగుల యోగక్షేమాలపైన భయం అక్కర్లేదని, వారి కోసం ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. 


కరోనా వైరస్ కలిగిస్తున్న విపత్తు పరిస్ధితుల నేపథ్యంలో ఐటి పరిశ్రమ వర్గాలతో మంత్రి కే. తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. వివిధ ఐటీ సంస్ధలు, సంఘాల ప్రతినిధులతో పరిమిత స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఇచ్చారు.  కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలపైన, విద్యసంస్ధలతోపాటు ఇతర సంస్ధల కార్యక్రమాలపైన పరిమితులు విధించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా  వారికి వివరించారు. 


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని, వీటికి అనుగుణంగా కార్యకాలపాలు నిర్వహించాలని ఐటి కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా శానిటేషన్, ఏంట్రీ పాయింట్లలో నిరంతర చెకింగ్ వంటి కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. ఇతర దేశాల్లో పర్యటించి వచ్చిన ఉద్యోగులతో పాటు భవిష్యత్తులలో కంపెనీల కార్యకలాపాల కోసం వచ్చేటువంటి ప్రతినిధులను ముందుగా క్వారైంటైన్ పిరియడ్ పాటించేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వైద్య ఆరోగ్యశాఖ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..