తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడు రాష్ట్రానికి ప్రయాణం కానున్నారు.  ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన బేగంపాట విమానాశ్రయం నుండి చెన్నై బయలుదేరతారు. చెన్నై వెళ్లగనే ఆయన డీఎంకే నేత స్టాలిన్‌తో సమావేశం అవుతారు. తన థర్డ్ ఫ్రంట్ ఆలోచనపై ఆయన ఆ తర్వాత ఆ పార్టీ నేతలతో చర్చిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్ పార్టీ)కి చెందిన పలువురు ముఖ్యమైన నేతలు కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇటీవలే కేసీఆర్ తన థర్డ్ ఫ్రంట్ ఆలోచనను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. దేశ రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చి.. మార్పు అనివార్యమని తలచి తాను ఈ థర్డ్ ఫ్రంట్ ఆలోచన వైపు మొగ్గు చూపించానని కేసీఆర్ ఇటీవలే అన్నారు. ఈ క్రమంలో ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు జేడీఎస్ నాయకుడు ఎస్ డి దేవెగౌడను కూడా కలిశారు. 


అయితే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్ అంశంపై భిన్న వాదనలు వచ్చాయి. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ సాగే అవకాశాలు లేదని సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌ తెలిపారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ ఆలోచన అంత ప్రాక్టికల్‌గా వర్క్ అవుట్ కాదని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై మిశ్రమ స్పందనను కనబరిచారు.


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చేతకానితనమే ఈ ఫ్రంట్ రావడానికి కారణమని ఆయన అన్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన వచ్చినప్పుడు పలు విషయాలను పంచుకున్నారు. చైనా జనాభాలో భారతదేశం కన్నా ఎక్కువగా ఉన్నా.. ఆసియా నెంబర్ వన్ దేశంగా ఉందని.. కానీ భారతదేశంలో మాత్రం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, పథకాల పేరులు మార్చడమే పనిగా పెట్టుకుంటాయి కాని.. వికాస సూత్రాలు పాటించవని అన్నారు. మార్పును కోరుకోవాలనుకుంటే అది థర్డ్ ఫ్రంట్ వల్లే సాధ్యమని అన్నారు