CM Revanth Reddy: మరో అపచారం.. ఖైరతాబాద్ దగ్గర సీఎం రేవంత్ పూజ చేస్తుండగా.. తెగిపడిన గజమాల.. వీడియో వైరల్..
Khairatabad maha ganesh: ఖైరతాబాద్ గణపయ్య దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
cm revanth reddy khairatabad firest puja: దేశంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన కూడా ప్రజలు ఇళ్లలో, మండపాలలో గణపయ్యను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గణేష్ నవరాత్రుల్లో గణపయ్యను చూసేందుకు ఎక్కడి నుంచో జనాలు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. అంతేకాకుండా.. నవరాత్రుల్లో ఒక్కసారి అయిన.. ఖైరతాబాద్ గణపయ్యను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ కు తొలిసారి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున హజరయ్యారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తుండగా.. ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఖైరతాబాద్ గణపయ్య మెడలో నుంచి గజమాల ఒక్కసారిగా తెగిపోయి కింద పడింది. దీంతో అక్కడున్న వారంతా.. షాకింగ్ తో నోరెళ్లబెట్టారు. ఇదిలా ఉండగా.. కొంత మంది మాత్రం దీన్ని అపచారంగా భావించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి .. సెక్రెటెరియట్ లో..తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపన చేస్తుండగా... సీఎం చేతిలో నుంచి గుమ్మడి కాయ ఒక్కసారిగా జారీపోయి కిందకు పడింది. ఈ ఘటనఅప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు.. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణపయ్యకు పూజలు చేస్తుండగా.. గజమాల తెగిపడిపోవడంతో.. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
Read more: Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. పలువురు బీజేపీ నాయకులు మాత్రం.. కన్పించిన దేవుళ్ల మీద ఓట్టులు వేసి, రుణమాఫీ గురించి లేనిపోనీ , వ్యాఖ్యలు చేశాడని, అందుకే ఇలాంటి పరిణామాలు ఎదురౌతున్నాయని కూడా సెటైర్ లు వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.