Cm Revanth reddy hot comments on bjp and brs: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర  కూడా దేశంలో గొప్ప మార్పు తీసుకొచ్చిందన్నారు. ఇక ఈ యాత్రతో.. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేయడంలో రాహుల్  విజయం సాధించాని రేవంత్ పేర్కొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో.. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగామని రేవంత్ అన్నారు. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే చెప్పిమని రేవంత్ పేర్కొన్నారు. 17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.  ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. ఇదే తమ పాలనకు ప్రజల్లో ఉన్న గుర్తింపుగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు  39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఈ  ఎంపీ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగిందని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో స్పష్టంగా  అర్ధమవుతోందని రేవంత్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారు  2019లో బీజేపీ 4 గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం,  ఈ ఎన్నికల్లో 35 శాతానికి పెరిగాయన్నారు.  బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకున్నారని సెటైర్ లు వేశారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీ కి బదిలీ చేశారన్నారు.



రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారన్నారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి, మోసం చేశారని రేవంత్ అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆరెఎస్ ఈ ఎన్నికల్లో 16.5 ఓట్ల శాతానికి పడిపోయిందని అన్నారు. 2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావులు.. బీజేపీకి తాకట్టు పెట్టారంటూ రేవంత్ మండిపడ్డారు.


ఈ ఎన్నికలలో పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి తెరతీశారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్..  తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి సంపూర్ణంగా మద్దతు పలికారన్నారు.  బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదు.. వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని ఫైర్ అయ్యారు. కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారన్నారు.


 ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆర్ఎస్ కు సూచన చేస్తున్నామని రేవంత్ అన్నారు.ఎమ్మెల్యే హరీష్ రావు... ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి, వారే కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారని ఎద్దేవా చేశారు. మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ దేశంలో.. 303 సీట్ల నుంచి 243కి పడిపోయింది.


మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారని రేవంత్ అన్నారు. దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని, తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని, విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలని రేవంత్ సెటైర్ లు వేశారు. 


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..


ఇప్పటివరకు తాము..  18 గంటలే పనిచేసాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తామని రేవంత్ అన్నారు. ప్రస్తుతం వచ్చిన ఫలితాలు..  ఉగాది పచ్చడిలాంటివి..కేసీఆర్ బీజేపీ తో బేరసారాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు అంటూ తీవ్ర స్థాయిలో రేవంత్ ఫైర్ అయ్యారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం..ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter