Praja Palana Application Form: 'ప్రజా పాలన' దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని ప్రజలకు సూచించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని చెప్పారు. గతంలో లబ్ధి పొందని వారు.. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు అప్లై చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. 'ప్రజా పాలన' దరఖాస్తుల పరిస్థితులపై సీఎస్, CM ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 28వ తేదీ నుంచి 'ప్రజా పాలన' కార్యక్రమం ప్రారంభంకాగా.. ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటివరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా చూడాలని.. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను అమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని.. ప్రజాపాలన కార్యక్రమం వద్ద తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు.


రెండో రోజు (శుక్రవారం) ప్రజా పాలన కార్యక్రమంలో మొత్తం 8,12,862 దరఖాస్తులు స్వీకరించినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. పట్టణ  ప్రాంతాలలో GHMCతో కలిపి 4,89,000 దరఖాస్తులు అందాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల  నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాగా.. తొలిరోజు గురువారం 7,46,414 అభయహస్తం దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి GHMCతో సహా 4,57,703 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. 


Also Read: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!


 Also Read: Pawan Kalyan: ఏపీలో భారీ అవినీతి.. సీబీఐ విచారించండి.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖa



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter