CM Revanth Reddy: డబ్బు ఉంటేనే రాజకీయాలు కాదు.. సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చు: సీఎం రేవంత్ రెడ్డి
BR Ambedkar Law College Alumni Meet: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ప్రభుత్వ కొలువు సాధించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు.
BR Ambedkar Law College Alumni Meet: డబ్బులు ఉంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కనపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చని.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే.. తప్పకుండా ఆదిరిస్తారని అన్నారు. బాగ్ లింగంపల్లిలోని BR అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నీమీట్, గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
"4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యాను. ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వివేక్, వినోద్ రామాయణంలో లవకుశుల లాంటివారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానం. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతం. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిది. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చు..
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి.. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్‌కు అండగా ఉంటుంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం.." అని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాలేజీ సమయమంలోనే భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే.. భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలన్నారు. డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని.. విద్యార్థులు మంచిగా చదువుకు ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్నారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook