CM Revanth Reddy: టీయూజేఎస్ లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
Telangana Journalist Union: టీయూజేఎస్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఆవిష్కరించారు. టీయూజేఎస్కు అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని సమాచార కమిషనర్‌ను ఆదేశించారు.
Telangana Journalist Union: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘానికి (టీయూజేఎస్) అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో టీయూజేఎస్ లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం టీయూజేఎస్ కన్వీనర్ ఎంఎం రహమాన్ మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Also Read: Vara Rasi Phalalu In Telugu: ఈ వారం రాశి ఫలాలు..6 రాశులవారికి తిరుగులేదు ఇక..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ.. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలంటూ అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎం చీఫ్ పీఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘం నేతలు మునీర్, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్, పసూనూరి రవీందర్, ఖాజీపేట నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter