Telangana లో తక్కువ టెస్టులకు కారణం అదే: జీవన్ రెడ్డి
COVID-19 tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడానికే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు చేయడం లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. `` కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేశాయి`` అని మండి పడ్డారు.
COVID-19 tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడానికే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు చేయడం లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. '' కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేశాయి'' అని మండి పడ్డారు. ఓవైపు కరోనాతో జనం ఇబ్బందులు పడుతోంటే.. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులతో లాలూచీ పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జీవన్ రెడ్డి.. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులకు మేలు చేసేందుకే వాటి దోపిడీని అరికట్టే దిశగా సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైద్యానికి డబ్బుల్లేక, కార్పొరేటు ఆస్పత్రులకు వెళ్లలేక జనం నానా కష్టాలు పడుతున్నారన్న జీవన్ రెడ్డి.. ఇకనైనా కొవిడ్-19 చికిత్సతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సను (Black fungus) ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also read: COVID-19, Black fungus కి ఉచిత వైద్యం అందించిన తొలి రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
ఇదిలావుంటే, గురువారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం అప్పటివరకు గత 24 గంటల్లో రాష్ట్రంలో 69,252 కరోనా పరీక్షలు చేయగా వారిలో 3,660 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక ఏపీలో గత 24 గంటల్లో 1,01,281 కరోనా పరీక్షలు చేయగా వారిలో 22,610 మందికి కరోనావైరస్ (COVID-19 health bulletin) సోకినట్టు తేలింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook