Mahalakshmi Scheme: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంక్షేమ పథకంలో భాగమైన మహాలక్ష్మి పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో అప్డేట్ ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి అర్హురాలైన మహిళకు ప్రతినెల రూ.2500 సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలోనే ఈ గ్యారెంటీపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.ఇక త్వరలోనే మహిళ ఖాతాల్లో రూ. 2500 జమ కావచ్చు.


Also Read: Padma Awards 2024: పద్మ అవార్డుల్లో తెలుగు వెలుగులు.. చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మవిభూషణ్‌


కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగమైన రూ.500 గ్యాస్ కూడా త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది. అంటే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఈ పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోందట రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచడం తర్వాత మహాలక్ష్మి, రూ. 500 గ్యాస్ సిలిండర్ కూడా కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ముందుగానే అమలుచేయాలని అప్పుడే ప్రజలకు తమకు నమ్మకం కుదురుతుందని ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందట.. ఈనేపథ్యంలో వచ్చే నెలలోనే మహిళల  ఖాతాల్లో రూ.2500 పడేలా రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందట. అలా అయితే ఫిబ్రవరి నెల నుంచే మహాలక్ష్మి పథకం కూడా అమల్లోకి వచ్చినట్లే.
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook