Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ..
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఇద్దరి నుంచి వివరాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీలోని అందరూ నేతలను కలుపుకోవాలని పోవాలని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రెండు రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైనే కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. ఇందుకు పీసీసీదే బాధ్యతని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల 2వ తేదిన ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. సిన్హాకు టీఆర్ఎస్ ఘనస్వాగతం పలికింది. అయితే యశ్వంత్ సిన్హాను ఎవరూ కలవొద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాని రేవంత్ మాటలను పట్టించుకోకుండా బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాకు సీనియర్ నేత వీహెచ్ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా యశ్వంత్ విషయంలో పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. యశ్వంత్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే గోడకేసి కొడతామని హెచ్చరించారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. యశ్వంత్ సిన్హాను కలవొద్దని తమకు ఎవరూ చెప్పలేదని చెప్పారు. సీఎల్పీ నేతకు కూడా ఈ విషయం తెలియదంటూ బాంబ్ పేల్చారు.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపాయి. ఈ విషయంపై జగ్గారెడ్డి నుంచి వివరాలు తీసుకున్న ఏఐసీసీ లీడర్లు.. పీసీసీ చీఫ్ రేవంత్ , సీఎల్పీ నేత భట్టీని ఢిల్లీకి పిలిపించారు. యశ్వంత్ సిన్హాను కలవొద్దన్న విషయాన్ని పీసీసీ ఎమ్మెల్యేలకు చెప్పలేదా... చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు.. జగ్గారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా అన్న అంశాలపై ఆరా తీశారని తెలుస్తోంది. సీఎల్పీ నేతగా తనకు కూడా విషయం తెలియదని భట్టీ చెప్పడంతో రేవంత్ రెడ్డిపై వేణుగోపాల్ సీరియస్ అయ్యారని ఢిల్లీ వర్గాల సమాచారం. అందరిని కలుపుకుని పోవాలని చెబుతున్నా... పదేపదే అవే తప్పులు చేస్తున్నారని మందలించారని తెలుస్తోంది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేస్తున్న సమయంలో మళ్లీ ఈ గొడవలు ఏంటని నిలదీశారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పీసీసీ చీఫ్ కు గట్టిగానే చెప్పారని సమాచారం. యశ్వంత్ సిన్హా విషయంలో రేవంత్ రెడ్డి చేసిందే తప్పని హైకమాండ్ భావిస్తున్నట్లు ముందస్తుగా సమాచారం వచ్చినందువల్లే సంచలన ప్రకటన చేస్తానని చెప్పిన జగ్గారెడ్డి వెనక్కి తగ్గారని గాంధీభవన్ లో చర్చ సాగుతోంది.
మరోవైపు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న వస్తున్నారు రాహుల్. విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. రాహుల్ సభలో భారీగా చేరికలు ఉండేలా టీకాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.
Read also: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?
Read also: Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టిందెవరు..! జగన్ కు చిరంజీవి ఎందుకు దగ్గరయ్యారు?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook