కాంగ్రెస్ కు మరో షాక్: ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓటమి
ఇప్పటికే ఓటమి ఖయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్య రీలిలో ఓటమి పాలయ్యారు. ఆయన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడిపోతే కుంగిపోవడం.. గెలుస్తే ఉగిపోయే తత్వం తనది కాదని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పార్టీలో చర్చించాల్సి ఉందన్నారు.కాగా ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలు పక్షాల పోరాడుతుందన్నారు. నిరుద్యోగులు, రైతులు సమస్యల పట్ల మరింత బాధ్యతగా ఉంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల లెక్కింపు విషయంలో అక్రమాలు జరిగి ఉంటాయని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.