Congress Manifesto: రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రతి విద్యార్థికి స్కూటీ.. కాంగ్రెస్ హామీల వర్షం
Congress Manifesto For Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చింది.
Congress Manifesto For Telangana Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారని.. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఫైర్ అయ్యారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారని.. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని అన్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారుని.. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందని జోస్యం చెప్పారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని.. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. 42 పేజీలతో 62 ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
==> తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల స్థలం, గౌరవ భృతి.
==> వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.
==> 3 లక్షల వడ్డీ లేని పంట రుణం
==> 2 లక్షల రుణమాఫీ..
==> కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం
==> కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ
==> చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత
==> తొలి కేబినెట్‌లో మెగా డీఏస్పీ
==> రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్
==> విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్
==> విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు
==> ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు
==> వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు
==> ధరణి స్థానంలో భూమాత పోర్టల్
==> రేషన్ ద్వారా సన్న బియ్యం, రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ భృతి
==> కొత్త రేషన్ కార్డులు ..
==> 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు.
==> ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తాం..
==> ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం
==> బెల్ట్ షాపుల రద్దు
==> కళ్యాణ మస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం
==> మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు
==> జూనియర్ న్యాయవాదులకు మొదటి ఐదేళ్లపాటు నెలకు రూ.5 వేల గౌరవ భృతి
==> 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
==> హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ల సమస్యకు పరిష్కారం
==> ఎన్నారైల సంక్షేమ బోర్డ్
==> దివ్యాంగులకు 6 వేల పెన్షన్.
==> దేవాలయాలకు దూప దీప నైవేధ్యం కింద నెలకు రూ.12 వేలు
==> అంగన్‌వాడీ టీచర్లకు నెల వేతనం రూ.18 వేలు
==> మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలు
==> 50 ఏళ్లు నిండిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్
==> మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల నగదు
==> మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
==> రైతు కూలీలకు రూ. 12 వేలు
==> 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ
==> నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి
==> SC రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
==> కొత్తగా 3 ST, 3 SC కార్పొరేషన్లు ఏర్పాటు
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి