MLC Jeevan Reddy: బీజేపీలోకి జీవన్ రెడ్డి..?.. రంగంలోకి బండి, ఈటల.. స్పీడ్ గా మారుతున్న రాజకీయాలు..
Cm Revanth Reddy: తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఫోన్ లను ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
Mlc Jeevan reddy Will joins in bjp rumours viral: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నమ్మిన బంట్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తమనిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ లో అధికారం, హోదాలను అనుభవించి పార్టీ కష్టకాలంలో ఇలా మారడం పట్ల ఆయన్నుచాలా మంది తీవ్రంగా విమర్శించారు. మరోవైపు కేవలం రైతుల మంచి కోసమే.. తాను పార్టీ మారానని, సీఎం రేవంత్ పాలన పట్ల ఆకర్శితుడయ్యానని చెప్పుకొచ్చారు. తనకు పదవుల మీద ఆసక్తిలేదంటూ వ్యాఖ్యలుచేశారు.
ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. ఎవరు కూడా ఊహించని విధంగా సీఎం రేవంత్ ను జూబ్లిహిల్స్ లో కలిసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ వరుస పరిణామలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరిగా మారిందని చెప్పుకొవచ్చు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం, సంజయ్ కుమార్ ల చేరికలపై , కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తన జిల్లా నుంచి ఇద్దరు నేతలు పార్టీలో చేరిన తనకు కనీసం సమాచారం లేదని తీవ్ర మనస్తపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోచారం పార్టీలో చేరినప్పుడు.. ఇలాంటి రాజకీయాలు చేయోద్దని, మనకు కావాల్సిన మెజారిటీ ఉందని ఇండైరెక్ట్ గా రేవంత్ కు సూచించారు.
ఇప్పుడిక.. సంజయ్ కుమార్ చేరడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తానంటూ కూడా అన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల.. సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ.. జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు.
ఈ పరిణామల నేపథ్యంలో.. జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగిత్యాల నియోజక వర్గంలో.. 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్ లు, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడ్డారు.ఈ నేపథ్యంలో తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా.. సంజయ్ ను జాయిన్ చేసుకొవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జీవన్ ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. నలభై ఏళ్లుగా హుందాగా రాజకీయాలు చేశానని, ఇలాంటి పనుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీకీ రాజీనామా చేసి వ్యవసాయ పనులు చేయడానికి సైతం తాను సిద్ధమే అంటూ తన సన్నిహితులతో జీవన్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి బండి, ఈటల..?
సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల పట్ల కాంగ్రెస్ లోని అనేక మంది సీనియర్లు అంతా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగానే రేవంత్ తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. బీజేపీ కీలకనేతలు టచ్ లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. మెయిన్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్ లు రంగంలోకి దిగి, జీవన్ రెడ్డితో మంతనాలు నడిపిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో ప్రధాన అపోసిషన్ గా బీజేపీ ఎదుగుతుంది. ఇప్పటికే బీజేపీకి 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచి బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ పై.. మనస్తాపంగా ఉన్న జీవన్ రెడ్డి, బీజేపీలో చేరితే.. తమకు మరింత బలంచేకూరుతుందని ఆపార్టీ అభిప్రాయపడుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవర్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారా..? .. లేదా బీజేపీ కండువ కప్పుకుంటారా.. అనే విషయంలో మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.
Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి