Komatireddy Venkat Reddy: ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..కాసేపట్లో కేంద్రమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈభేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో కమలం గూటికి చేరనున్నారు. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతే రాజగోపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మళ్లీ ఇప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు వచ్చింది. అమిత్‌షాతో భేటీ అనంతరం బీజేపీపైలో చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని..పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడు వెళ్తానని తెలిపారు. 


మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో అంతరాత్మ ప్రబోధం అస్త్రం వాడనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు జరిగే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేయాలని తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, అనుచరులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నారు. 


1969లో కాంగ్రెస్‌ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి బరిలో నిలిచారు. ఐతే అంతరాత్మ ప్రబోధం అస్త్రం ద్వారా ఆయనను ఓడించేందుకు ఇందిరాగాంధీ ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ఓడిపోగా..విపక్షాల అభ్యర్థి వీవీ గిరి గెలిచారు. 1970లో ఇది సంచలనంగా మారింది. 1978లో ఇందిరాగాంధీ పెట్టిన ఇందిరా కాంగ్రెస్‌ పార్టీనే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీగా ఉంది. ఇందిరాగాంధీ ఉపయోగించిన అస్త్రానే మునుగోడు ఉప ఎన్నికలో వాడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారు. 


Also read:Shukra Upay: ప్రతి రోజూ శుక్ర మంత్రంతో పాటు ఈ మంత్రం జపిస్తే.. అన్ని శుభాలే..!


Also read:Bimbisara Movie: హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్.. కాలర్ ఎగరేస్తున్న నందమూరి ఫాన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook