Komatireddy Rajagopal Reddy: బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్...?
Komatireddy Rajagopal Reddy into BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
Komatireddy Rajagopal Reddy into BJP: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకంపనలు రేపుతున్నారు. కేంద్ర హోంమంత్రితో భేటీ తర్వాత ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మొదట్లో అదంతా దుష్ప్రచారమంటూ కొట్టిపారేసిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారడం చారిత్రక అవసరమంటూ ఆ తర్వాత తన మనసులో మాటను బయటపెట్టేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని... తగిన ముహూర్తం చూసుకుని బీజేపీలో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికైతే బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గానీ, బీజేపీ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా ఇరువురి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. బహుశా వచ్చే ఆగస్టు నెలలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గంలో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే పక్షంలో గతంలో హుజురాబాద్ మాదిరే మునుగోడుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో చేరాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి మరింత స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లేందుకు బీజేపీ డైరెక్షన్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉపఎన్నిక ఏర్పడితే గతంలో హుజురాబాద్ విషయంలో అనుసరించినట్లుగానే మునుగోడులోనూ బీజేపీ పకడ్బందీ వ్యూహాలను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ టాప్ లీడర్స్‌ను మునుగోడులో ప్రచారానికి దింపే అవకాశం ఉండకపోదు.
ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి దూకుడుకు గట్టి బ్రేక్ వేసేలా ఉందనే చెప్పాలి. ఇతర పార్టీల నేతల చేరికలతో ఇటీవల పార్టీకి ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొరకరాని కొయ్యలా మారింది. పార్టీపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నా ఇప్పటివరకూ కనీసం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాయబారం కూడా వర్కౌట్ కాకపోవడం.. పార్టీ మారడం చారిత్రక అవసరమని రాజగోపాల్ రెడ్డి చెప్పడం.. ఇక తాను పార్టీ మారడం పక్కా అని ఆయన సంకేతాలిచ్చినట్లుగానే కనిపిస్తోంది.
Also Read: Horoscope Today July 27th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి...
Also Read: మురళీ విజయ్‌ను ఆటాడుకున్న అభిమానులు.. దండం పెట్టినా వదలని ఫ్యాన్స్ (వీడియో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.