టీ కాంగ్రెస్కు షాక్ మీద షాక్!!
టీ కాంగ్రెస్కు షాక్ మీద షాక్!!
హైదరాబాద్: ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, ఓటమిభారంతో వున్న కాంగ్రెస్ పార్టీకి కొత్తగా మరో ఇబ్బందికరమైన పరిణామం ఎదురైంది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. తాజాగా మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు ఈమేరకు ఓ గెజిట్ నోట్ విడుదల చేసినట్టు సమాచారం. శాసనమండలిలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని.. టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు చేసిన విజ్ఞప్తి మేరకు వారిని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు సమాచారం.