Telangana Congress: దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సుమారు పదకొండు నెలలు కావొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెప్ ప్రభుత్వం  పాలన కొనసాగిస్తుంది. ఐతే రేవంత్ రెడ్డి సీఎం ఐన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదరవుతుంది. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఒక వైపు కాంగ్రెస్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ..మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే యత్నం చేస్తుంది. దీంతో తెలంగాణలో రాజకీయలు హాట్ హాట్ గా  మారుతుతన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఎప్పుడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందనేది కాంగ్రెస్ భావన. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమవుతున్నామన కాంగ్రెస్ తెగ ఫీల్ అవుతుంది. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక పోస్టులు వస్తున్నా వాటిని నిలవరించలేకపోతున్నామని కాంగ్రెస్ భావిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బీఆర్ఎస్, ఇతర పక్షాలు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో బురద జల్లాయని కాంగ్రెస్ లోలోన తెగ ఫీలవుతుంది. అధికారంలో ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నామని కాంగ్రెస్ అనుకుంటోంది. 


ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ ఎటాక్ చేయాలని వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల గాంధీ భవన్ లో ప్రత్యేకంగా దీనిపై చర్చ జరిగిందంట. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొని అసలు విషయాలను ప్రజల్లోకి బలంగా చేరవేసేలా ఒక స్పెషల్ వింగ్ ను ఏర్పాటు చేసుకోవాలాని డిసైడ్ అయ్యిందంట. గత ఎన్నికల్లో కాంగ్రెస్  గెలుపు కు సోషల్ మీడియా కూడా  ఒక కారణం. అలాంటి సోషల్ మీడియాను అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయని కాంగ్రెస్ అనుకుంటుంది. 


ఇక నుంచి మనం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారట. పార్టీ, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి ఒక పెద్ద జంబో టీమ్ ను రెడీ చేసుకోవాలనుకుంటున్నారట. దీంతో పాటు పార్టీ రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు, కీలక నేతలు కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని  పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సలహా ఇచ్చారట. మహేశ్ కుమార్ నిర్ణయం పట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా స్వాగతిస్తున్నాయి. 


ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్  గా ఉన్న వారి బలం సరిపోవడం లేదని మరింత మందితో స్పెషల్ సోషల్ మీడియా వింగ్ లు ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటికే గత ఎన్నికలో కాంగ్రెస్ కు పనిచేసిన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు డైరెక్షన్ లో ఈ వ్యూహానికి కాంగ్రెస్ పదునుపెట్టాలనుకుంటుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది. ఇలా ఐతే తప్పా మనం బీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కాంగ్రెస్ అనుకుంటుంది.అసలే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. 


రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ, హైడ్రా వంటి వాటిపై తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతను వచ్చేలా చేశాయని కాంగ్రెస్ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి.అలాంటి వాటిని అరికట్టకపోతే భవిష్యత్తులో పార్టీకీ ఇబ్బందులు తప్పవనేది కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నారు. అందుకే  ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంతో కీలకమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఉన్న ఫలంగా సోషల్ మీడియా వింగ్ ను ఆక్టివ్ చేయాలని సీరియస్ గా ప్లాన్ చేస్తుందంట. అందులో భాగంగా కొన్ని ప్రవేట్ ఏజెన్సీలను సైతం సంప్రదిస్తుందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


అన్నీ అనుకున్నట్లు జరిగితే దీపావళి నుంచే కాంగ్రెస్ సోషల్ మీడియా టీం రంగంలోకి దిగుతుందని కాంగ్రెస నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన వెంటనే దానిపై కౌంటర్లు ప్రజల్లోకి త్వరగా వెళ్లేలా చూడడమే ఈ సోషల్ మీడియా బాధ్యత . ఈ సోషల్ మీడియా వింగ్ ను గైడ్ చేయడానికి గాంధీ భవన్ లో ఒక స్పెషల్ సెల్ కూడా పిసిసి ఏర్పాటు చేయబోతుంది. ఏదైనా ఇష్యూను బట్టి ఎలా స్పందించాలో సోషల్ వారియర్స్ కు ఈ స్పెషల్ సెల్ సూచనలు ఇస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబతున్నాయి.


మొత్తానికి ఇక తెలంగాణలో రాజకీయలు మున్ముందు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై జరుగుతున్న దాడికి దిమ్మదిరిగే సమాధానం ఇస్తామంటోంది కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా విమర్శలకు దిగిన నేతలు ఇక సోషల్ మీడియాలో పెద్ద రాజకీయ యుద్దానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సోషల్ మీడియా వార్ లో ఏ పార్టీదీ పై చేయి అవుతుంది..? ఎవరి వాదనను ప్రజలు విశ్వసిస్తారు అనేది మాత్రం తేల్చేది కాలమే.


Also read: Spinach 10 Benefits: గుండె పోటు, డయాబెటిస్‌కు సైతం చెక్ పెట్టే అద్భుతమైన ఆకు కూర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.