Revanth Reddy About KCR: కేసీఆర్ పాలనను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్
Govt schools in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, పాఠశాలల్లో సౌకర్యాల లేమి, టీచర్ల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
Govt schools in Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్యాంపెయిన్ తరహాలో ఓ ఉద్యమానికి తెరతీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు లేమి, సరిపడా టీచర్లు లేరు, కనీస అవసరాలు, మౌళిక వసుతులు లేవు అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
శిథిలావస్థకు చేరుతున్న ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు సరిపడే తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కిందే తరగతుల నిర్వహణ., టీచర్ల కొరత, మధ్యాహ్న భోజనంలో కరువైన నాణ్యత, సౌకర్యాల లేమి, అపరిశుభ్ర వాతావరణం... ఇలా ఎన్నో రకాల సమస్యలు ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేశాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చదువుకునేందుకు చోటు లేదు.. చదువుకునెందుకు పుస్తకం లేదు, చదువులు చెప్పేందుకు గురువులు లేరు… శిథిలావస్థకు చేరుతున్న పాఠశాలల్లో పసి పిల్లల ప్రాణాలకు భరోసా లేదు అంటూ అనేక సమస్యలను లేవనెత్తారు. ఈ ఉద్యమ ద్రోహి పాలనలో.. పిల్లలను బడికి పంపేటప్పుడు పైలం బిడ్డో.. అని బడికి పంపే దుస్థితి నెలకొందంటూ సమస్య తీవ్రతను రేవంత్ రెడ్డి హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పరిపాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు బడులపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించిందంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
అచ్చంపేట నియోజకవర్గం తాగపూర్ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న దుస్థితిని వీడియో రూపంలో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి... పెచ్చులూడిన గోడలు, తరగతి గదుల్లో కరువైన సౌకర్యాలు, కలుషితమైన తాగునీటి సరఫరా, మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన అన్నం, పాఠశాలల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న వైనాన్ని ఈ ట్విటర్ వీడియో ద్వారా హైలైట్ చేశారు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో అసెంబ్లీ వేధికగా సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇచ్చిన హామీలను కూడా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ వీడియోలో ప్రస్తావించారు. ఈ వీడియో ద్వారా ఉద్యమ ద్రోహి అనే హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ అయ్యేలా స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
Also Read : Munugode Byelection: కూసుకుంట్లపై పార్టీ నేతల తిరుగుబాటు! కేసీఆర్ కు మునుగోడు బైపోల్ టెన్షన్..
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook