Dharani Portal Issues: ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ హామీ కార్డు.. పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
Congress Dharani Guarantee Card: ధరని పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కాంగ్రెస్ హామీ కార్డు” పేరుతో కార్డులు జారీ చేసి.. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోనుంది.
Congress Dharani Guarantee Card: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ధరణి సమస్యలపై మరింత ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఇతర భూ యజమానులకు “కాంగ్రెస్ హామీ కార్డు” పేరిట కార్డులు అందజేస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్‌లో ‘ధరణి అదాలత్’ పేరిట పైలెటె ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలో ఐదుగురు “భూరక్షక్ ”లను నియమిస్తుంది. వీరికి ధరణి పోర్టల్, భూ సమస్యల మీద ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ భూరక్షకులు ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో ధరణి అదాలత్ పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, ఇతరుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. అనంతరం ధరణి బాధితుల పూర్తి వివరాలతో కూడిన “కాంగ్రెస్ హామీ కార్డు” ను సదరు బాధితులకు అందజేస్తుంది.
ధరణి పోర్టల్ ద్వారా ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా పరిష్కరిస్తామనే హామీతో ఈ కార్డు బాధితులకు అందచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీ కార్డును బాదితులు తమ మండలానికి చెందిన స్థానిక తహసీల్దార్, మండల రెవెన్యూ అధికారికి చూపించటం ద్వారా ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగిన ధరణి అదాలత్‌లో 31 మంది రైతులకు “కాంగ్రెస్ హామీ కార్డు”లను అందజేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి జైరాం రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Also Read: Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!
Also Read: Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి