Social Media Campaign: ఎన్నికలకు ముందు ఓ లెక్క.. ఎన్నికల తర్వాత ఓ లెక్క. ప్రస్తుతం తెలంగాణలో  పొలిటికల్ పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సోషల్ మీడియా దుమ్ము లేపింది. ఒక రకంగా కాంగ్రెస్ గెలవడానికి యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియానే కారణమనే టాక్ ఉంది. కాని కొత్త ప్రభుత్వం వచ్చాక సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో  బీఆర్ఎస్ యాక్టివ్ గా కనిపిస్తుండగా.. కాంగ్రెస్ వెనకబడిపోయింది. ఆరు గ్యారెంటీలతో  సీఎం రేవంత్ రెడ్డిని ఆటాడుకుంటున్నారు గులాబీ సోషల్ సైనికులు. బీఆర్ఎస్ నెగెటివ్ ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల తర్వాత ప్రతిపక్షపార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. అయితే అధికారంలోకి వచ్చిన ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ..రెండు వారాలకే బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి తంటాలు పడుతుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ లోపాన్ని అసెంబ్లీ సమావేశాలు బయటపెట్టాయి. తమ పార్టీకి చెందిన లీడర్ ఓ స్టేట్‌మెంట్ ఇస్తే అది నిజమని నమ్మించేందుకు బీఆర్ఎస్ టీమ్ జెట్ స్పీడ్ లో పనిచేసింది. చకచకా కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ  సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం చెప్పే అంశాలు, నిజాలు, డాక్యుమెంట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం విఫలమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలపరుస్తూ వచ్చారు కేటీఆర్. దానిపై చాలా పెట్టుబడి పెట్టారు. దేశ విదేశాల్లో సోషల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేశారు. ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలనుకుంటే బీఆర్ఎస్ ఇట్టే చేస్తుంది.కాని తెలంగాణ ఎన్నికల సమయంలో మాత్రం బీఆర్ఎస్ టీమ్ కొంత వెనకబడింది. ఫలితాల్లో ఊహించని ఫలితాలు రావడంతో మళ్లీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ఫలితాల తర్వాత కసిగా పని చేస్తోంది. కేటీఆర్ గులాబీ సైన్యం.  రేవంత్ కేబినెట్ టీమ్, కేటీఆర్‌ ఐటీ మినిస్టర్ ఎపిసోడ్ ను రోజంతా  ట్రెండింగ్ లో ఉంచింది. విపక్షంలో ఉన్నా  బీఆర్ఎస్ కు సోషల్ మీడియాలో పెద్దగా నష్టం జరగడం లేదుకానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి సోషల్ మీడియా వ్యవస్థ కనిపించడం లేదు. 


ఎన్నికల సమయంంలో సునీల్ కనుగోలు టీం సోషల్ మీడియాలో అద్భుతంగా పనిచేసింది. కాంగ్రెస్ గెలుస్తుందనే మౌట్ టాక్ రావడం వెనుక సునీల్ సోషల్ మీడియా టీం సక్సెస్ అయింది. ఇక  కొంత మంది టీడీపీ సానుభూతిపరులు కూడా బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ కు  పని చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా , రేవంత్ కు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టుుల పెట్టారు. ఇప్పుడా రెండు వర్గాలు తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేయడం లేదు. దీంతో కాంగ్రెస్ వైపు నుంచి సరైన సోషల్ మీడియా పోరాటమే కనిపించలేదు.అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వాయిసే ఎక్కువగా వైరల్ అయింది. కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలు మాత్రం వైరల్ కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఓ ఆటాడుకుంటున్నారు గులాబీ సోషల్ సైనికులు. ఏ చిన్న అవకాశం దొరికినా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ జర్నీ.. ఇలా అన్ని అంశాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నరు. బీఆర్ఎస్ చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ బాగా వెనకబడిందనే టాక్ వస్తోంది. 


తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా తన సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటే సరి.. లేదంటే ముందు ముందు బీఆర్ఎస్ సోషల్ మీడియా దూకుడుకు డ్యామేజ్ కావాల్సి ఉంటుందనే ఆందోళన కాంగ్రెస్ కేడర్ లో వ్యక్తమవుతోంది. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వర్కవుట్ చేస్తారో చూడాలి మరీ..


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి