ఇంటర్ బోర్డు వైఫల్యాలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కు  ప్రజా సంఘాలతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు తెలిపారు. బంద్ కు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలకు పలు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిలిచిపోయిన బస్సు సౌకర్యాలు


బంద్ నేపథ్యంలో  బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు తెలంగాణలో వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రవాణా సౌకర్యాలు ఎక్కడి కక్కడ స్తంభించాయి. అయితే హైదరాబాద్ బస్సులు, ఎంఎంటీఆస్, మెట్రో లకు మినహాయింపు ఇచ్చారు. 


కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష


మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్ లో తన దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో  తన దీక్ష నాల్గో రోజుకు చేసింది. ఏప్రిల్‌ 29 నుంచి మొదలుపెట్టిన లక్ష్మణ్..  విద్యార్థులకు న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగిస్తానని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఒకవైపు దీక్ష కొససాగిస్తూనే తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఈ మేరకు  ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.