MLA RAJASINGH ON CONGRESS: కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నారు..!
MLA RAJASINGH ON CONGRESS: భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరీ ప్రదర్శిస్తోందన్నారు బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత రాజాసింగ్. జనం నవ్వుకుంటున్నా ఆ పార్టీ నేతలకు సిగ్గురావడం లేదన్నారు.
MLA RAJASINGH ON CONGRESS: భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నాయకులు ఆ ఆలయంలో పూజలు నిర్వహించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ స్పందించారు. నమాజ్ చేస్తామనేది వాళ్లే.. తిరిగి పూజలు చేస్తున్నది వాళ్లే అంటూ వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. నమాజ్ కోసం సంతకాల సేకరణ చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవడం పక్కనబెట్టి పూజలు చేయడం ఏంటన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో ద్వంద్వ వైఖరీ అవలంభిస్తున్నారని విమర్శించారు. ఓ వైపు ఆలయం వద్ద నమాజ్ చేస్తామంటారు.. మరోవైపు ఆలయాన్ని కూల్చేస్తామంటూ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారని.. ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరీకి ఇదే నిదర్శమన్నారు రాజాసింగ్.
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో ఏనాడు బీజేపీ రాజకీయాలు చేయలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. అమ్మవారి విశిష్టిత, గొప్పతనాన్ని చాటిచెబుతున్నామన్నారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆలయాన్ని కూలుస్తానంటే చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించారు. ఎంపీ బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేనే లేదన్నారు. అమ్మవారి ఆలయాన్ని కూలుస్తామన్న కాంగ్రెస్ నేతలపై.. ఆ పార్టీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సిగ్గులేకుండా బీజేపీపైనే ఎదురుదాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని రాజాసింగ్ చెప్పారు. ఇప్పటికైనా ద్వంద్వ వైఖరీని వీడాలని సూచించారు.
Also Read: Nazriya Nazim Pics: గ్లామర్ డోస్ పెంచేసిన నజ్రియా నజీమ్.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Revanth Reddy: కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేసి తీరుతా... అమెరికాలో రేవంత్ రెడ్డి శపథం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook