Coronavirus positive cases in Telangana హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 37,283 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 167 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే (GHMC) 55 కేసులు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 12 కరోనా కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 164 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, మరొకరు కరోనాతో కన్నుమూశారు. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం కరోనా వైరస్‌తో (Coronavirus deaths) మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 3,976 కి పెరిగింది.


తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 latest updates from Telangana) సంఖ్య 6,73,889 కి చేరింది. కరోనావైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,66,176 మందికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,737 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.