తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉంది. నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 17న) 1,682 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల (Telanganga CoronaVirus Positive Cases) సంఖ్య 93,937కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 8 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 711 మంది కరోనాతో మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే 2,070 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 72,202 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 21,024 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, మరో 14,140 మంది ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉన్నారు.


అత్యధికంగా జీహెచ్‌ఎంసీ (GHMC Corona Cases) పరిధిలో 235 కోవిడ్19 కేసులు నిర్ధారించారు. జిల్లాలవారీగా చూస్తే.. రంగారెడ్డి 166, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106, వరంగల్‌ అర్బన్‌ 107, నిజామాబాద్‌ 94,  భద్రాద్రి కొత్తగూడెంలో 27, ఖమ్మంలో 45, జిల్లాలో 107, కరీంనగర్‌ 88, మంచిర్యాల 79, జోగుళాంబా గద్వాల 69,  పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 59, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు.