Coronavirus second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కేసులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. జి శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా పూర్తిగా ముగిసినట్టే అని శ్రీనివాస రావు తెలిపారు. కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులపై దృష్టిసారిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాస రావు అన్నారు. కరోనా సెకండ్ వేవ్ (COVID-19 second wave) విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస రావు ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైలీ పాజిటివిటీ రేటు, ఏ రోజుకు ఆరోజు కరోనాతో ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య, కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం పూర్తి నియంత్రణలో ఉన్నాయని డా శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణలోని అన్ని రీజియన్స్, జిల్లాల్లో పరిస్థితిని ఏ రోజుకు ఆరోజు సమీక్షిస్తున్నాం అని చెప్పిన శ్రీనివాస రావు (Dr. G Srinivasa Rao).. ప్రజానికం అప్రమత్తతో, స్వీయ క్రమశిక్షణతో ఉంటే ఇకపై కూడా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు అని సూచించారు. 


అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలోనూ తెలంగాణలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయనే వార్త నిజమే అయితే, అంతకంటే ఊరటనిచ్చే అంశం ఇంకేముంటుంది. అందులోనూ కరోనావైరస్ థర్డ్ వేవ్ (Corona third wave) రాబోతోందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి రావడం శుభ సూచకమే అని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.