దేశంలోనే అతిపెద్ద పంప్.. కాళేశ్వరం సొంతం
భారతదేశంలోనే అతి పెద్ద మోటారు పంపును తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేటాయించారు.
భారతదేశంలోనే అతి పెద్ద మోటారు పంపును తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేటాయించారు. ఒకేచోట చాలా ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపును తయారుచేయడం ప్రపంచంలో కొన్ని చోట్ల చేశారని.. భారతదేశంలో ఇదే తొలిసారని ఈ సందర్భంగా తెలంగాణ నీటిపారుదల శాఖ తెలిపింది. 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇలాంటి ఏడు పంపులు ఈ పథకానికి అవసరం.
180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి మళ్లించే 'కాళేశ్వరం ఎత్తిపోతల పథకం'లో మొత్తం 82 పంపులు అవసరమవుతాయని అంచనా. దాదాపు 22,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాడానికి వీటి అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి పంపులు, మోటార్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసే ఏర్పాట్లను ట్రాన్స్‌కో శరవేగంగా చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం రూ.80,500 కోట్లతో నిర్మిస్తోంది