Medaram: సమ్మక్క సారక్క జాతరలో పోలీస్ అత్యుత్సాహం.. భార్యాభర్తలపై చేయి చేసుకున్న వైనం
Medaram Police Hit To Devotees: మేడారం జాతరలో కిక్కిరిసి ఉన్న భక్తులను అదుపు చేయలేక ఓ పోలీస్ అధికారి ఇద్దరిపై చేయి చేసుకున్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉండడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వివాదంతో పోలీస్ అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Couple Alleged On ACP Officer Hit: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో అట్టహాసంగా జరుగుతోంది. గద్దెలపై అమ్మవార్లు కొలువుదీరడంతో దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఒక్క మేడారంలోనే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర కూడా నిర్వహిస్తారు. అలా ఆత్మకూరు మండలంలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో వివాదం ఏర్పడింది. వాహనాల పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం కాస్త పోలీస్ అధికారి దాడి చేసే స్థాయికి చేరుకుంది.ఈ సమయంలో వాహనదారులకు అక్కడి పోలీస్ అధికారులకు మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో ఓ పోలీస్ ఉన్నత అధికారి వాహనదారులపై చేయి చేసుకున్నారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. పురుషుడితోపాటు అతడి భార్యపై కూడా దాడి చేశారని వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో పోలీస్ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Also Read: Kurnool Court: జంట హత్య కేసులో సంచలన తీర్పు.. సంసారానికి పనికి రాని భర్తకు, మామకు ఉరిశిక్ష
జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌తండాకు చెందిన శ్రీనివాస్-పద్మిని దంపతులు ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో జరిగిన సమ్మక్క సారక్క జాతరకు బుధవారం వెళ్లారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తుండడంతో వాటికి పార్కింగ్ సమస్య ఎదురైంది. వాహనం అక్కడ నిలుపరాదని పరకాల ఏసీపీ కిశోర్ కుమార్ కోరారు. అయితే ఈ సమయంలో చిన్న వివాదం ఏర్పడింది. వెంటనే ఆగ్రహంతో ఏసీపీ అధికారి శ్రీనివాస్‌ను కొట్టే ప్రయత్నం చేయగా భార్య పద్మిని అడ్డుకుంది. క్షణికావేశంలో ఉన్న పోలీస్ అధికారి పద్మినిపై కూడా దాడి చేశాడు. ఇద్దరిపై అతడు దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది.
Also Read: Marriage Turns To Tragedy: తాళి కట్టి వారం కాకముందే.. ఎస్సైతో సహా నవ వరుడు దుర్మరణం
తమపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని రాత్రి ఆ దంపతులతోపాటు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై ఏసీపీ కిశోర్ కుమార్ వివరణ ఇచ్చారు. తాను వారిని కొట్టలేదని స్పష్టం చేశారు. దంపతులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని చెప్పారు. తన చేయి తాకిందని వివరణ ఇచ్చారు. వారిని కొట్టలేదని తెలిపారు. కాగా ఈ సంఘటన వివాదం రేపడంతో ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి