COVID-19 cases in telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  1,897 కరోనా కేసులు నమోయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్‌తో 15 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5,95,000 కి చేరగా, కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,409 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్రంలో 24,306 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మరో 5,67,285 మంది కరోనా నుంచి పూర్తిగా రికవర్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తమ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.


Lockdown in telangana: తెలంగాణలో లాక్‌డౌన్ అప్‌డేట్స్:
కరోనా పాజిటివ్ కేసులను తగ్గించడంలో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు పలు సడలింపులు ఇస్తూనే లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించుకుంది. జూన్ 10 నుంచి ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను (Lockdown timings in telangana) కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ పోలీసు శాఖను ఆదేశించింది.


సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ నియోజక వర్గాల పరిధిలో కరోనావైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రానందున.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాత్రం లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగించనున్నట్టు కేబినెట్ (Telangana cabinet) స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.