COVID-19 Vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు.. అంటే శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్‌ను (Gap between Covishield vaccine first dose and second dose) కేంద్ర ప్రభుత్వం 6-8 వారాల నుంచి కనీసం 12 వారాలకు పెంచిన నేపథ్యంలో ఇదివరకే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు కోవిన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా శ్రీనివాస రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సిన్ పంపిణీ అమలవుతుందని డా శ్రీనివాస్ రావు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకుని, షెడ్యూల్ చేసుకున్న వారి వివరాలు కూడా సంబంధిత వ్యక్తులకు అందుతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా టీకాల కొరత కారణంగా ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకునే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఫస్ట్ డోస్ తీసుకునే వారికి వ్యాక్సినేషన్ నిలిపేసిన సంగతి తెలిసిందే. 


ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌కి మినహాయింపు ఇస్తుండటంతో ఆ సమయంలో కార్యకలపాలు యధావిధిగానే జరుగుతున్నాయి. రోడ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో జనం రద్దీ కనిపిస్తోంది. 10 తర్వాత లాక్‌డౌన్ (Lockdown in Telangana) అమలులోకి రావడంతో రోడ్లపైకి వచ్చే జనం సంఖ్య భారీగా తగ్గిపోతోంది. ఒకవేళ ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వచ్చినా వచ్చినా పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు. అక్కడక్కడ లాక్‌డౌన్ ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ-పాస్ (Telangana e-pass) తీసుకున్న వారిని మాత్రం పోలీసులు అడ్డుకోవడం లేదు.