పవన్ కళ్యాణ్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) నేత చాడా వెంకట్ రెడ్డి విమర్శించారు. "పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయనకు తెలంగాణ ప్రజల కష్టాలేంటో తెలియదు" అని ఆయన అన్నారు. జనసేన పార్టీ ద్వందవైఖరి అవలంబిస్తోందని.. రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందని ఆయన ఆరోపించారు. 


"తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దళితుల పాత్ర కీలకం. అలాంటి దళితులను ప్రభుత్వం అరెస్టులు చేయడం దారుణం. మందకృష్ణ మాదిగను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అంటూ ప్రజలను మభ్యపెడుతోందని తెలిపారు. ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌కు యూనిట్‌కు 5 రూపాయలు చెల్లిస్తోందని.. ఈ విధంగా ప్రజలపై రెండువేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతోందని ఆయన తెలిపారు.