CPI Narayana: క్రెడాయ్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దూమారాన్నే రేపాయి. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండించారు. ముందుగా సొంత రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా చూసుకోవాలంటూ చురకలు అంటించారు. అయితే కేటీఆర్‌ వ్యాఖ్యలను సీపీఐ నారాయణ సమర్ధించారు. కేటీఆర్‌ కామెంట్స్‌ తో ఏకీభవిస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా ఏపీలో రోడ్ల పరిస్థితులను అందరికీ చూపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్ర, తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పర్యటించి రోడ్ల పరిస్థితులను వివరించారు. తమిళనాడు రోడ్లు చక్కగా ఉంటే.. ఏపీలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకకానికి ఉన్నంత తేడా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు నగరి మండలంలోని తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వెళ్లే రహదారులను చూడండంటూ వీడియోలు తీసి రోడ్ల సమస్యలను ఎత్తిచూపారు.


 Also Read: Ramya Murder Case Verdict: దిశ చట్టం పవర్ ఇదే..21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించొచ్చు..రోజా సంచలన వ్యాఖ్యలు


Also Read: Gopichand: డూప్ లేకుండా నటిస్తూ ప్రమాదానికి గురైన గోపీచంద్, ఆ సినిమా విడుదల వాయిదానా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.