Mallu Swarajyam Final Yatra Schedule: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర కొనసాగుతోంది. పార్టీ నేతలు, ప్రజల సందర్శనార్థం ఆమె పార్ధివదేహాన్ని మాకినేని బసవ పున్నయ్య భవన్‌లో ఉంచారు. తమ అభిమాన నాయకురాలిని చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పుష్పంజలి ఘటించారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు అక్కడే పార్ధివదేహాన్ని ఉంచుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమ యాత్ర మొదలై.. ప్రకాశం బజార్, ఆర్‌.పీ రోడ్‌ మీదుగా పెద్ద గడియారం సెంటర్‌కు వరకు సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు మల్లు స్వరాజ్యం సంతాపం సమావేశం నిర్వహిస్తారు. ఇందులో కమ్యూనిస్టు ముఖ్య నేతలు పాల్గొంటారు. అనంతరం ఆమె పార్ధివదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలిస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు.  


మల్లు స్వరాజ్యం మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు ఇతర ముఖ్య నేతలు దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. 


మల్లు స్వరాజ్యం మృతి తీరని లోటు అని అన్నారు. ఇటు కమ్యూనిస్టు ముఖ్య నేతలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.  గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగురాష్ట్రాల్లో మల్లు స్వరాజ్యం పేరు తెలియని వారు ఉండరు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలందించారు. 


Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!


Also Read: Shalini Pandey Pics: అర్జున్​ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook