Warangal: వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్ట్...రూ.2 కోట్లు సీజ్..
వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Cricket betting gang arrest: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting)కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు వరంగల్ పోలీసులు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని...వారి నుంచి రూ.2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయ్ అనే ఇద్దరు బుకీలను అరెస్టు(Cricket betting gang arrest in Warangal) చేశారు.
వీరు ముంబయి(Mumbai) కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో గత 3 నెలల నుంచి బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డులు, ఎనిమిది సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు.
Also Read: Brutal Murder: గోదావరిఖనిలో దారుణ హత్య-ముక్కలుగా నరికి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట...
బెట్టింగ్ దందా మహారాష్ట్ర(Maharashtra) కేంద్రంగా నడుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితులు ముంబైలో ఉన్నట్లు గుర్తించామని.... అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు తెలిపారు. నిందితుడు ప్రసాద్ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో బట్టల వ్యాపారం నిర్వహించేవాడని పోలీసులు వెల్లడించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2016 నుంచి క్రికెట్, పేకాట బెట్టింగ్ ప్రారంభించాడని చెప్పారు. ఈ క్రమంలో ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహించే మరో నిందితుడు అభయ్‌తో ప్రసాద్‌కు పరిచయం ఏర్పడినట్లు వారు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook