Hyderabad Metro incident: మెట్రో స్టేషన్‌ లిఫ్టులో (Metro station lift) ఎక్కిన యువతి ముందు ఓ యువకుడు బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
ఖైరతాబాదుకు చెందిన ఓ యువతి (23) మంగళవారం అమీర్ పేటలో షాపింగ్ కు వెళ్లింది. షాపింగ్ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్ వెళ్లేందుకు అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లిప్ట్ ఎక్కింది. అమె వెనకే లిఫ్ట్‌లోకి ప్రవేశించిన రాజు(19) అనే యువకుడు తన దుస్తులు విప్పి, అసభ్య చేష్టలతో భయపెట్టాడు. దీంతో లిప్ట్ నుంచి పరుగున బయటకు వచ్చిన ఆ యువతి..విషయాన్ని మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే వారు రాజును పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.


నిందితుడు ఒడిశా వాసిగా పోలీసులు గుర్తించారు. రోజు మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళల ముందు ఇదే తీరుగా అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. రాజును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు ఎస్సార్‌నగర్‌ పోలీసులు.


Also Read: Beer Prices Hike: తెలంగాణలో మరింత ప్రియం కానున్న బీరు, 20 రూపాయల వరకూ పెంపు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook