తెలంగాణ: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు కారు ప్రమాదానికి గురవడం కలకలం రేపుతోంది. స్థానిక ప్రముఖ మీడియా కథనం మేరకు.. ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల ప్రకారం, కారు ఇంపీరియల్ గార్డెన్ సమీపంలో ఒక హోండా యాక్టివా టూ వీలర్ బైక్‌ను 10.30 గంటల సమయంలో ఢీ కొట్టింది. బైక్ కేపీహెచ్‌పీ కాలనీ నుండి లాల్‌గూడకి వెళ్తోంది. బైక్ రాంగ్ రూట్లో సడెన్‌గా దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట‌నే వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్‌కి అంబులెన్స్‌లో త‌ర‌లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 337 ప్రకారం కేసు నమోదు చేశారు. నిర్మాతకు సెక్షన్ 41 కింద ఒక నోటీసు జారీ చేసి పోలీసుల ఎదుట హాజరవ్వాలని ఆదేశించారు.